Rayaparthy Government Junior College Teachers Day
Published:
* డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్
* ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం
ఆకేరు న్యూస్, రాయపర్తి:
సమాజానికి ఉపాధ్యాయులే దిక్సూచిలా విద్యార్థుల జీవితాలకు మార్గం చూపే మార్గదర్శకులని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు. శనివారం రాయపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులకు సన్మానించారు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలతో, దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ విద్యా సం. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయని, ఉచిత పాఠపుస్తకాలతో పాటు విద్యార్థులకు రాసుకోవడానికి నోట్ బుక్స్, బ్యాగ్స్, షూస్ తదితర అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.ఇంటర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తూ అధ్యాపనంలో విద్యార్థులు గురువులను నిరంతరం అనుసరించాలని, వారి ద్వారా జ్ఞానసముపార్జనకు ప్రయత్నించాలని అన్నారు. నేర్చుకోవడం, రాయడంలో ఎక్కడా వెనుకబడకూడదని అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు షూ,బ్యాగుల పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయని అందులో మొత్తం 2704 విద్యార్థులకు గాను 32448 నోట్ బుక్స్ పంపిణీ అయినట్లు తెలిపారు. ఈ సం. మారిన పాఠ్యాంశాల ప్రకారం 80 మార్కులు వార్షిక పరీక్షల్లో, 20 మార్కులు అంతర్గత మూల్యాంకనం ఉన్నందున అంతర్గత మార్కులకు గాను ఈ నోట్ బుక్స్ ను సద్వినియోగం చేసుకోవాలని, అధ్యాపకులు మారిన పాఠ్యాంశాలు, సిలబస్ బోధన పై పట్టు సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జయకుమారి, రాయపర్తి గ్రామ సర్పంచ్ సహేంద్ర భిక్షపతి, లైబ్రేరియన్ సునీల్ రెడ్డి, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

సీనియర్ కరస్పాండెంట్
గిద్దె ఎల్లయ్య
గత పదిహెను సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
