AP CM Chandrababu Warning to MLAs
* స్థానిక ఎన్నికల్లో ఓట్ శాతంపైనే భవిష్యత్
* శాశ్వత ఎమ్మెల్యేగా ఉండేలా పనిచేయాలి
* ఏపీలో లీడర్షిప్ కాంక్లేవ్
* ముఖ్యమంత్రి చంద్రబాబ్ కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, అమరావతి : ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఓట్ శాతం పెరగాలని, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా 2024 కన్నా మంచి ఫలితాలు వస్తాయని తాము జరిపిన సర్వేలో తేలిందని వెల్లడించారు. ఒకవేళ ఎక్కడైనా ఓట్ శాతం పెరగకపోతే ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు పనిచేయనట్లే అన్నారు. ఎమ్మెల్యేల భవిష్యత్ ఓట్ శాతంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే పనితీరు మెరుగుపడాలని హెచ్చరించారు. శాశ్వత ఎమ్మెల్యేగా ఉండేలా పని చేయాలని సూచించారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయవద్దని హితవు పలికారు.
* సోషల్ మీడియాపై పట్టు సాధించాలి
సోషల్‌మీడియాపై ఎమ్మెల్యేలు పట్టుసాధించాలని చంద్రబాబు తెలిపారు. అసత్య ప్రచారానికి వెంటనే సమాధానం ఇవ్వాలని, మనం ఏతప్పూ చేయలేదని పేర్కొన్నారు. మనకు వచ్చే అవకాశాలను అందుపుచ్చుకోవాలని నేతలకు సూచించారు. రాజకీయ నాయకులు వర్తమానాన్ని అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మనకు సహకరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై నివేదిక తయారు చేస్తామని చెప్పారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు అండగా ఉంటున్నామని వెల్లడించారు.
* వారి విమర్శలు సిగ్గుచేటు
ఒక్క డీఎస్సీ పెట్టని వ్యక్తి మనలను విమర్శించడం సిగ్గుచేటు అని సీఎం పేర్కొన్నారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2027 మార్చి వరకు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. అనేక రకాల పెట్టుబడులు విశాఖ రీజియన్ కి వస్తున్నాయని వెల్లడించారు.
* ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్దు చేశామని ప్రకటించారు. సర్వే రాళ్లపై బొమ్మలు వేస్తే వాటిని తొలగించామన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్ర వేసి పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఫేక్ ప్రచారం చేస్తే వాటిని తిప్పి కొట్టాలని, ఫేక్ ప్రచారానికి వాస్తవం అనే బ్రహ్మాస్త్రంతో సమాధానం చెప్పాలని శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో మంచి జరిగితే గొడ్డలి పార్టీ బ్రేక్ ప్రచారానికి సిద్ధంగా ఉంటుందన్నారు. డిఎస్సీపై గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారం చేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఎవరేమన్నా 2047 వరకు దేశంలో ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
