Minister Ponnam Prabhakar Chigurumamidi Telangana Public School
* రూ.9.62 కోట్లు మంజూరు
* హుస్నాబాద్‌లో విద్యకు మహర్దశ..
ఆకేరు న్యూస్, హుస్నాబాద్: చిగురుమామిడి పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా రూపుదిద్దేందుకు ప్రభుత్వం తొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ నిధుల ద్వారా డిజిటల్ స్మార్ట్ బోర్డులు , కంప్యూటర్ ల్యాబ్‌లు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే పెద్ద గ్రంథాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేక క్రీడా మైదానాలు, బాలబాలికలకు వేర్వేరుగా పరిశుభ్రమైన శౌచాలయాలు, స్వచ్ఛమైన తాగునీటి శుద్ధి ప్లాంట్లు వంటి అన్ని రకాల ప్రాథమిక వసతులను ప్రభుత్వం కల్పించబోతోంది.
* పేద, మధ్యతరగతి కుటుంబాలకు తీరనున్న ఆర్థిక భారం
చిగురుమామిడి మండల కేంద్రంలోనే ఈ పబ్లిక్ స్కూల్ అందుబాటులోకి రావడం వల్ల చిగురుమామిడి మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్న పరిసర గ్రామాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. సొంత ఊరి సమీపంలోనే అంతర్జాతీయ స్థాయి విద్య లభించడం వల్ల ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్లాల్సిన అవసరం లేకుండా పేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుంది.
* మోడల్ ఎడ్యుకేషన్ హబ్‌గా నియోజకవర్గం
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చడమే తమ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి పేద విద్యార్థికి అత్యున్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు, పాఠశాలల బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చిగురుమామిడికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం పట్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
