Jogulamba Road Accident Mahabubabad
* ఇద్దరు అక్కడికక్కడే మృతి..
* మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్, మహబూబాబాద్: ఆలయ దర్శనానికి వెళ్తున్న కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం కోసం కారులో బయలుదేరిన క్షణాల్లోనే దారుణ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి శివారులోని జాతీయ రహదారిపై (NH-44) ఈ ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో డ్రైవర్ అదుపు తప్పడంతో కారు లారీని బలంగా ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో ప్రయాణిస్తున్న మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్టణానికి చెందిన మౌనిక (25), హైదరాబాద్కు చెందిన సాయిరామ్ (38) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
