BRS Station Ghanpur Protest
* బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రాల అందజేత
* కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
* ఆ పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో బీఆరఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడమే కాకుండా, వారిపై పోలీసులు దాడి చేసి, బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించడం అప్రజాస్వామికమన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజావాణి కేంద్రాల్లో వినతిపత్రాలు సమర్పించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆరఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ ఆకుల కుమార్, మాజీ సర్పంచ్ తాటికొండ సురేష్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, కౌన్సిలర్లు చల్లా రమ్య-రఘు రెడ్డి, తాటికొండ మధు, బాలగాని అనిల్, పొన్న రాజేష్, రాఘవాపూర్ సర్పంచ్ మెరుగు క్రాంతి కుమార్, యూత్ అధ్యక్షుడు గుండె మల్లేష్, గుండె రంజిత్, శీలం శ్యామ్, ఎండీి జబ్బార్, నాగపురి పావని, మారేడుపాక రమాదేవి, జ్యోతిరెడ్డి, సుజాత, ప్రవీణ్, తాటికాయల అరుణకుమార్, హీర సింగ్ తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
