Gaze Venugopal PRC Demand
* పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
ఆకేరు న్యూస్, రాయపర్తి: పీఆర్సీ వెంటనే ప్రకటించాలని గాజే వేణుగోపాల్ అన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ రాయపర్తి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా TGEJAC జిల్లా చైర్మన్ గాజే వేణుగోపాల్ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి పాలకుర్తి సదానందం కోశాధికారి అంచ కిరణ్ కుమార్, యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాటికాయల కుమార్ సుజన్ ప్రసాద్, ఎస్ టి యు జిల్లా అధ్యక్షుడు మధు లేమియా, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ జిల్లా అధ్యక్షుడు గోవిందరావు మహేందర్ రెడ్డి, టిఆర్టిఎఫ్ తాళ్లపల్లి రాజు పంచాయతీ సెక్రెటరీ ఫోరం రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ, సిటీ అధ్యక్షుడు శoకేషి రాజేష్, ఎంపీడీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాక శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ యాకుబ్ నాయక్, రాయపర్తి మండలం టీచర్ల యూనియన్ నాయకులు, రాయపర్తి మండల పంచాయతీ కార్యదర్శిల అధ్యక్షుడు రాకేష్, ప్రధాన కార్యదర్శి మోయనుద్దీన్ మరియు ఇతర శాఖల ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
