SBI SCO Recruitment notification 2026
* 207 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు..
* సెప్టెంబర్ 25 వరకు దరఖాస్తులు
ఆకేరు న్యూస్, డెస్క్: SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 207 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నియామకం ప్రధానంగా వెల్త్ మేనేజ్మెంట్, రిటైల్ బ్యాంకింగ్ విభాగాల్లో చేపట్టనుంది.
* సెప్టెంబర్ 25 వరకు దరఖాస్తులు
SBI SCO Recruitment 2026 దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 4న ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 25, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ sbi.bank.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
| పోస్టు పేరు | ఖాళీలు |
|---|---|
| జోనల్ హెడ్ (రిటైల్) | 1 |
| రీజినల్ హెడ్ | 5 |
| రీలేషన్షిప్ మేనేజర్ – టీమ్ లీడ్ | 24 |
| ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ | 9 |
| ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ | 4 |
| వీపీ వెల్త్ | 91 |
| ఏవీపీ వెల్త్ | 73 |
| మొత్తం | 207 |
* అర్హతలు ఇవే
కనీసం గ్రాడ్యుయేషన్ అర్హత అవసరం. పోస్టును బట్టి MBA, CFA, CFP లేదా NISM సర్టిఫికేషన్లు ఉంటే ప్రాధాన్యత ఉంటుంది. సంబంధిత పని అనుభవం కూడా తప్పనిసరి. జోనల్ హెడ్ పోస్టుకు కనీసం 15 సంవత్సరాలు, రీజినల్ హెడ్‌కు 12 సంవత్సరాల అనుభవం అవసరం. మిగిలిన పోస్టులకు పోస్టును బట్టి 3 నుంచి 8 సంవత్సరాల వరకు సంబంధిత అనుభవం ఉండాలి. వయసు 23 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఈ పోస్టులకు వేతనాలు కూడా భారీగానే ఉన్నాయి. జోనల్ హెడ్ పోస్టుకు సంవత్సరానికి రూ.97 లక్షల వరకు, రీజినల్ హెడ్‌కు రూ.66.40 లక్షల వరకు, ఏవీపీ వెల్త్ పోస్టుకు రూ.30.20 లక్షల వరకు వేతనం లభించనుంది.
* రాత పరీక్ష లేదు
ఈ నియామకంలో రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థులను ముందుగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి, మెరిట్ లిస్ట్ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.
* దరఖాస్తు విధానం
అభ్యర్థులు SBI అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఫోటో, సంతకం, అవసరమైన అనుభవ ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. జనరల్, OBC, EWS అభ్యర్థులు రూ.750 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
అధికారిక ప్రకటన : https://sbi.bank.in/documents/77530/57941334/03092026_1_Advt+_Wealth+MGMT_04.09.2026.pdf/d2fd7bab-0791-b62b-61d3-8f46c2cb3ec6?t=1788439145915
అధికారిక వెబ్సైట్ : https://sbi.bank.in/web/careers/current-openings

Please tell us what is wrong. Your report will be sent to the website team.
