Palakurthi BRS Women Protest
* అమలుకాని ఆరు గ్యారంటీలు..
* మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉషా దయాకర్ రావుల ఆధ్వర్యంలో వంటా-వార్పు, భారీ నిరసన ప్రదర్శన
ఆకేరు న్యూస్,పాలకుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని మండిపడుతూ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మహిళలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు హాజరై మహిళలకు పూర్తి సంఘీభావం తెలిపారు.
పాలకుర్తి వీధుల్లో మహిళలు పానా, ఝాన్సీ లక్ష్మీబాయిల వలే వీరోచితంగా నినదిస్తూ, పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో వంటా-వార్పు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
* ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ
“కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రతి మహిళకు నెలకు ₹2,500 ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని ఇప్పుడు మొండిచేయి చూపారు. మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న తులం బంగారం, విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీల హామీలు ఏమయ్యాయి? కాంగ్రెస్ చెప్పిన 420 హామీలు, ఆరు గ్యారంటీలన్నీ బోగస్ అని తేలిపోయిందనీ అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు మహిళల తరఫున పోరాటం ఆపేది లేదు.”
* ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ
“తెలంగాణ ఆడబిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో అరకొర సౌకర్యాలు కల్పిస్తూ, మహాలక్ష్మి సహాయం, తులం బంగారం, ఉచిత విద్యుత్ వంటి ప్రధాన హామీలను పక్కన పడేసింది. ఈ రోజు పాలకుర్తిలో మహిళలు రోడ్డుపైకి వచ్చి చేస్తున్న నిరసన ఈ ప్రభుత్వ పతనానికి నాందనీ పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, BRS పార్టీ నాయకులు, ఎర్రబెల్లి ట్రస్ట్ సభ్యులు మరియు వేలాది మంది మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
