Child Height Growth Problems
* ఈ వయసులోనే గుర్తించాలి
* పిల్లల ఎత్తు పెరుగుదలపై డాక్టర్ కీలక సూచనలు
* సర్జరీలపై వార్నింగ్
ఆకేరు న్యూస్, డెస్క్: పిల్లల ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వయస్సుకు తగ్గట్టుగా పిల్లల ఎత్తు పెరుగుతోందా లేదా అనే విషయాన్ని గమనించాలని చెబుతున్నారు. 2 నుంచి 10–12 ఏళ్ల మధ్యలోనే గ్రోత్ డిజార్డర్స్‌ను గుర్తించి చికిత్స అందిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని డాక్టర్ శ్రావణ్ తెలిపారు.
* 2 ఏళ్ల తర్వాత గ్రోత్‌ను గమనించాలి
పిల్లల్లో ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు సాధారణంగా రెండేళ్ల తర్వాత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుందని డాక్టర్ శ్రావణ్ తెలిపారు. పిల్లలను పీడియాట్రీషియన్ వద్దకు తీసుకెళ్లినప్పుడు గ్రోత్ చార్ట్ ఆధారంగా వారి వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారని చెప్పారు. 2 నుంచి 10–12 ఏళ్లలోపు గ్రోత్‌లో లోపాలను గుర్తిస్తే చికిత్స చేయడం సులభంగా ఉంటుందని వివరించారు. అయితే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు 16, 17 లేదా 20 ఏళ్లు వచ్చిన తర్వాత ఎత్తు పెరగడం లేదని వైద్యులను సంప్రదిస్తున్నారని.. ఆ వయసులో చికిత్స చేయడం కష్టమవుతుందని పేర్కొన్నారు.
* హైట్‌ను ప్రభావితం చేసే మూడు ప్రధాన అంశాలు
పిల్లల ఎదుగుదలపై ప్రధానంగా మూడు అంశాలు ప్రభావం చూపుతాయని డాక్టర్ శ్రావణ్ తెలిపారు.
పోషకాహారం (Nutrition) హార్మోన్లు (Hormones) వంశపారపర్యం/జన్యుపరమైన అంశాలు (Genetics)
తల్లిదండ్రులిద్దరి ఎత్తు తక్కువగా ఉంటే.. పిల్లలు కూడా తక్కువ ఎత్తు ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. పోషకాహార లోపం ఉంటే చికిత్సతో మెరుగుదల పిల్లల్లో పోషకాహార లోపం, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉంటే సరైన పోషకాహారం అందించడం ద్వారా ఎదుగుదల మెరుగుపడే అవకాశం ఉందని డాక్టర్ తెలిపారు.
* సర్జరీలపై వార్నింగ్
ఎత్తు పెంచేందుకు సర్జరీ చేయడం శాస్త్రీయంగా సమర్థించబడిన సాధారణ చికిత్స కాదని డాక్టర్ శ్రావణ్ తెలిపారు. ఇలాంటి విధానాలకు శాస్త్రీయ ఆధారం లేదని, ఎవరైనా హైట్ పెంచేందుకు సర్జరీ చేయిస్తామని చెబితే నమ్మవద్దని సూచించారు. పిల్లల సహజ ఎదుగుదలలో తొలి దశల్లోనే గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంటుందని డాక్టర్ తెలిపారు. గర్భంలో ఉన్న సమయంలో శిశువు వేగంగా ఎదుగుతుందని, సాధారణంగా పుట్టే సమయానికి సుమారు 50 సెంటీమీటర్ల పొడవు ఉంటుందని వివరించారు.
* యవ్వన దశలో మరోసారి వేగంగా పెరుగుదల
పిల్లలు యవ్వన దశలోకి ప్రవేశించే సమయంలో మరోసారి గ్రోత్ స్పర్ట్ కనిపిస్తుందని డాక్టర్ శ్రావణ్ తెలిపారు. ఈ దశలో కొంతకాలం వేగంగా ఎత్తు పెరిగి, అనంతరం క్రమంగా ఎదుగుదల తగ్గి ఆగిపోతుందని వివరించారు. కుటుంబంలో ఎత్తు తక్కువగా ఉండే పరిస్థితిని Familial Short Stature అంటారని డాక్టర్ తెలిపారు.తల్లిదండ్రుల ఎత్తు తక్కువగా ఉండి, అదే విధంగా పిల్లలు కూడా తక్కువ ఎత్తు ఉండటం.. కుటుంబంలో ఈ లక్షణం తరతరాలుగా కొనసాగడం దీనిలో కనిపిస్తుందని వివరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
