Jangaon Best Teachers Awards
* 60 పాఠశాలలు.. 120 మంది ఉత్తమ ఉపాధ్యాయులు
* సుధా హై స్కూల్‌కు చెందిన ఇద్దరు గురువులకు ప్రత్యేక గౌరవం
ఆకేరు న్యూస్, జనగామ : జనగామ జిల్లాలో టీఆర్ఎస్ఎంఏ (TRSMA) ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనగామ-సూర్యాపేట రోడ్డులోని భ్రమరాంబ ఫంక్షన్ హాల్లో శనివారం ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని 60 పాఠశాలలకు చెందిన 120 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా గౌరవించారు.
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వేడుకల్లో సుధా హై స్కూల్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు దొడ్డ సత్యనారాయణ, బి. నరేందర్ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై అవార్డులు అందుకున్నారు. ఇద్దరు గురువులు అవార్డులు అందుకోవడం సుధా హై స్కూల్‌తో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, క్రమశిక్షణను అలవర్చడం, నైతిక విలువలను పెంపొందించడం, విద్యలో ముందుకు నడిపించడం వంటి పలు అంశాల్లో దొడ్డ సత్యనారాయణ, బి. నరేందర్ చేస్తున్న సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించారు.
ఈ సందర్భంగా సుధా హై స్కూల్ ప్రిన్సిపాల్ రాపాక విజయ్ కుమార్, డైరెక్టర్ నీలిమ, ఉపాధ్యాయ బృందం దొడ్డ సత్యనారాయణ, బి. నరేందర్‌లను అభినందించారు. ఇలాంటి గురువులను గౌరవించడం అంటే భవిష్యత్ తరాలను గౌరవించడమేనని కొనియాడారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
