418 Movie A Certificate
* విభిన్నమైన హారర్ చిత్రం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మైత్రి మూవీ మేకర్స, ‘418’తో థియేటర్లకు ఒక విభిన్నమైన హారర్ చిత్రాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రంతో కీర్తన్ నాడగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఆయనే కథను కూడా అందించారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ థ్రిల్లర్ సెన్సార్‌తో సహా అన్ని లాంఛనాలను పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది.
* ప్రపంచవ్యాప్తంగా 18న రిలీజ్..
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. పోస్టర్ లో మసక వెలుతురులో నేలపై కూర్చున్న ఒక వ్యక్తి, ‘ఏ’ అక్షరం ఆకారంలో ఉన్న రక్తపు మరకల వైపు తన ఒక చేతిని చాచి ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ నీడల వెలుగు, మసక రంగులు, పాతబడిన ఆకృతులు, స్పష్టంగా కనిపించే గీతలు ఒక టెర్రిఫిక్ గా ఉన్నాయి. 418′ సీరియస్ ఇంటెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.
ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ సినిమాలోని మెయిన్ సీక్రెన్ ని ఇంకా రివిల్ చేయకుండా, భయానక ప్రపంచం గురించి కొన్ని గ్లింప్స్ అందించింది. ఇప్పుడు చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయడానికి సిద్ధమవుతోంది.ఈ చిత్రానికి దినేష్ దివాకర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, వెంకీ జీజీ సంగీతం , నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఉల్లాస్ హైదూర్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
