Yadadri Devotees Rush
* దర్శనానికి గంటల సమయం
ఆకేరు న్యూస్, యాదాద్రి భువనగిరి జిల్లా : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వరుస సెలవు రోజులు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రి క్షేత్రానికి చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
* క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు..
స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ పెరగడంతో ఉచిత దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంటన్నర సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ఆలయ పరిసరాల్లోని పలు ప్రాంతాలను సందర్శిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
