* నలుగురు అధికారులకు మెమోలు
* సమీక్షలో మంత్రి తుమ్మల సైతం ఆగ్రహం
* ఈ నష్టానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem district) అశ్వారావుపేట మండలం (Ashwaraopeta mandal) లోని పెదవాగు( Peddavagu) వర్షాలకు గండిపడిన విషయం తెలిసిందే. దీంతో భారీ నష్టం వాటిల్లింది. పలు ఇళ్లు నీట మునిగాయి. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు నిండా మునిగాయి. పంటలకు నష్టం వాటిల్లింది. వర్షాలకు ముందస్తు హెచ్చరికలు ఉన్నా అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ నష్టం జరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (National Dam Safety Authority) వర్షాకాలానికి ముందు పెదవాగు ప్రాజెక్టు స్థితిగతులు ఏంటి అనే వివరాలను తనిఖీలు చేశారా? పెదవాగుకు సంబంధించిన సమగ్ర వివరాలు, ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకోవడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నలుగురికి మెమోలు జారీ చేసింది. పెదవాగు ప్రాజెక్టు పరిధిలో 30 మంది పనిచేయాల్సి ఉండగా.. కేవలం 10 మంది మాత్రమే పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం వహించిన ఈఈ సురేశ్‌కుమార్ (EE Sureshkumar), డీఈఈ కృష్ణ (DEE Krishna), ఏఈఈ కృష్ణ (AEE Krishna) తో పాటు మరో అధికారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ సెక్రటరీకి (State Irrigation Department Secretary) భద్రాద్రి జిల్లా చీఫ్ ఇంజనీర్ (Bhadradri District Chief Engineer) శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) లేఖ రాశారు.
మంత్రి సమీక్ష
పెదవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడంపై మంత్రి తుమ్మల (Minister Thummala) సమీక్ష జరిపారు. గత నెలలోనే మోటార్లను ఎందుకు పర్యవేక్షించలేదని, 18 రోజులుగా మోటార్లను పరిశీలించకుండా నిర్లక్ష్యం వహించారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఇళ్లు, 47 ట్రాన్స్ ఫార్మర్లు మునగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ఈనెల 17న గేట్లు ఎత్తి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. దీనిపై ప్రభుత్వపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
————————-