Magallu Zindabad
Magallu Zindabad: ఆకేరు న్యూస్, హైదరాబాద్: గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మగాళ్లు జిందాబాద్. యంగ్ హీరో శ్రీ నందు, వెన్నెల కిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నార ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఘనంగా లాంచ్ చేశారు.
సెటైరికల్ కామెడీగా..
మగాళ్లు జిందాబాద్ ఒక సోషల్ సెటైరికల్ కామెడీ చిత్రమని దర్శకుడు నార ప్రవీణ్ తెలిపారు. సమాజంలో పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలను వినోదాత్మకంగా చూపించేందుకు ఈ కథను రూపొందించినట్లు చెప్పారు. ఆడవారికి దక్కే కంఫర్ట్, సానుభూతి, న్యాయం వంటి అంశాలను మగవారి కోణంలో సెటైరికల్‌గా చూపించామని వెల్లడించారు.
ఆడవారిని తక్కువ చేయడం కాదు
హీరో శ్రీ నందు మాట్లాడుతూ.. మగాళ్లు జిందాబాద్ టైటిల్ చాలామందిలో ఆసక్తిని, మరికొందరిలో నవ్వును కలిగిస్తుందని అన్నారు. ఆడవారిని డామినేట్ చేయడం లేదా తక్కువ చేయడం ఈ సినిమా ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. మగవాళ్లు నిజ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను వినోదాత్మకంగా చూపించడమే లక్ష్యమన్నారు. ఆరేళ్ల నుంచి 60 ఏళ్ల వరకు కుటుంబ సమేతంగా హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని శ్రీ నందు తెలిపారు. ఆడవాళ్లు ఎప్పుడూ గ్రేట్ అని, అందుకే ఆడవాళ్లు జోహార్ అని ఆయన అన్నారు. కార్యక్రమంలో నిర్మాత ప్రసాద్ భాస్కర్ల తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
