Sobhita Dhulipala
Sobhita Dhulipala: ఆకేరు న్యూస్, హైదరాబాద్: పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం వెట్టువం తొలి గ్లింప్స్ విడుదలైంది. వరల్డ్ ఆఫ్ వెట్టువం పేరుతో విడుదలైన నాలుగు నిమిషాల వీడియోలో సినిమా ప్రపంచాన్ని పరిచయం చేశారు.
ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల రాధి పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె చేసిన యుద్ధ కళల శిక్షణ, సెట్స్‌లో చేసిన కృషిని గ్లింప్స్‌లో చూపించారు. ఈ సందర్భంగా తన కోడలు శోభితను నాగార్జున ప్రశంసించారు. వావ్.. ఈ ప్రపంచ నిర్మాణం నాకు చాలా నచ్చింది. శోభిత, నువ్వు చాలా కష్టపడ్డట్లు కనిపిస్తోంది. చాలా బాగుంది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ నాగార్జున ఎక్స్‌లో పోస్టు చేశారు. మూడు కాలపరిమితుల్లో సాగే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ‘వెట్టువం’ రూపొందుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఆర్య, వీఆర్ దినేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
