Southwest Monsoon
* దేశంలో 15 శాతం లోటు వర్షపాతం..
* ఖరీఫ్ పంటలపై ప్రభావం
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : దేశంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. పశ్చిమ రాజస్థాన్ నుంచి నైరుతి రుతుపవనాలు శనివారం నిష్క్రమించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 4న కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. జూలై 9 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాయి.
అయితే ఈసారి రుతుపవనాల సీజన్లో పలు ప్రాంతాల్లో వర్షపాతం లోటు నమోదైంది. ఎల్నినో ప్రభావంతో జూలై మినహా మిగిలిన నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిశాయి. జూన్ 1 నుంచి శనివారం వరకు దేశవ్యాప్తంగా సాధారణంగా 817.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 695.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 15 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది.
ప్రాంతాల వారీగా చూస్తే దక్షిణ భారతంలో 28 శాతం, తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల్లో 26 శాతం వర్షపాతం లోటు నమోదైంది. వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపినట్లు వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైన నేపథ్యంలో మిగిలిన ప్రాంతాల నుంచి కూడా నైరుతి రుతుపవనాలు క్రమంగా వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
