AISF
ఆకేరు న్యూస్, హనుమకొండ: అఖిల భారత విద్యార్థి సమాఖ్య 90వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో హనుమకొండ జిల్లా కేంద్రంగా నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని AISF తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల ఇన్చార్జి రెహమాన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ, విద్యార్థుల హక్కులు, నాణ్యమైన విద్య కోసం ఉద్యమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ AISF కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆదివారం యూనివర్సిటీ ఫస్ట్గేట్ వద్ద AISF 90వ వార్షికోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో AISF హనుమకొండ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్, యూనివర్సిటీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
