ANM Employees
ANM Employees: ఆకేరు న్యూస్, రంగారెడ్డి: బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా శాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తీన్మార్ మల్లన్న ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మల్లన్నను కలిసిన ఓ ఏఎన్ఎం భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. 23 ఏళ్లుగా సేవలందిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఉద్యోగం పర్మనెంట్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించినా పరిస్థితిలో మార్పు రాలేదని తెలిపారు.
ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ పలుమార్లు దీక్షలు, ధర్నాలు చేసినా ప్రభుత్వాలు తమ సమస్యలను పట్టించుకోలేదని ఆమె మల్లన్నకు వివరించినట్లు ప్రెస్నోట్లో పేర్కొన్నారు.
అధికారులతో మాట్లాడిన మల్లన్న
ఏఎన్ఎంల సమస్యలను విన్న మల్లన్న అక్కడి నుంచే సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు ప్రెస్నోట్లో తెలిపారు. సమస్యను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
TSECANM దీక్షకు మద్దతు
కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్యల పరిష్కారం కోసం TSECANM చేపడుతున్న దీక్షకు మల్లన్న మద్దతు ప్రకటించారు. ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ వంటి అంశాలపై ఏఎన్ఎంల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడుతానని ఆయన హామీ ఇచ్చినట్లు ప్రెస్నోట్లో పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
