* మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లు
* పన్నుల ఆదాయం 28.83 లక్షల కోట్లు
* ద్రవ్యలోటు 4.9 శాతం ఉండొచ్చని అంచనా
* అప్పులు, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా అంచనా
* మరింత సరళంగా జీఎస్టీని మారుస్తాం
* మొబైల్ పరికరాలపై 15 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
* ప్లాస్టిక్ వస్తువులపై పన్ను పెంపు
* లెదర్ వస్తువులపై పన్ను తగ్గింపు
* ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఊరట అంతంతే
* స్టాండర్డ్ డిటెక్షన్లో కొంత వెసులుబాటు
ఆకేరు న్యూస్ డెస్క్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో బడ్జెట్ 2024-25 ప్రవేశపెట్టారు. వేతనజీవులకు కొంత ఊరట లభించింది. స్టాండర్ట్ డిటెక్షన్ ను 50 వేల నుంచి 75వేలకు పెంచారు. కొన్ని రకాల కేన్సర్ మందుల తగ్గింపు, బంగారం, వెండి, మొబైల్ పరికరాల దిగుబడి సుంకం తగ్గింపు మినహా.. మిగిలిన అంశాల్లో అంతగా ఊరట కనిపించలేదు. కాగా, వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టి నిర్మలాసీతారామన్ చరిత్ర సృష్టించారు. ఉద్యోగం, నైపుణ్యం, ఎంఎస్ఎంఈ, మధ్య తరగతిపై ఈసారి బడ్జెట్లో ఫోకస్ పెట్టినట్లు మంత్రి తెలిపారు. 2025 వార్షిక సంవత్సరానికి చెందిన బడ్జెట్లో విద్య, ఉద్యోగం, నైపుణ్యం రంగాల కోసం 1.48 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు. ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్లో ప్రకటించిన అనేక స్కీమ్లు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు. తాత్కాలిక బడ్జెట్లో ఇచ్చిన ప్రాముఖ్యతలనే .. వికసిత్ భారత్ సాధన కోసం అమలు చేస్తున్నట్లు మంత్రి సీతారామన్ ప్రకటించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తంగా 48.21 లక్షల కోట్లుగా వెల్లడించారు. ఇందులో మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లు కాగా, పన్నుల ఆదాయం 28.83 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్యలోటు 4.9 శాతం ఉండొచ్చని అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా అంచనా వేశారు. మరింత సరళంగా జీఎస్టీని మారుస్తామని నిర్మలమ్మ తెలిపారు.
బడ్జెట్లో 9 అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. అవేమిటంటే..
1. వ్యవసాయం – ఉత్పాదకత
2. ఉద్యోగ కల్పన – నైపుణ్యాభివృద్ధి
3. సమ్మిళిత అభివృద్ధి – సామాజిక న్యాయం
4. తయారీ సేవల రంగం
5. పట్టణాభివృద్ధి
6. ఇంధన భద్రత
7. మౌలిక సదుపాయాల కల్పన
8. ఆవిష్కరణలు – పరిశోధనాభివృద్ధి
9. భవిష్యత్ సంస్కరణలు
కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబుల మార్పులు ఇలా..
– 3 లక్షల వరకు పన్ను మినహాయింపు
– 3 లక్షల నుంచి 7 లక్షల ఆదాయానికి 5 శాతం
– 7 లక్షల నుంచి 10 లక్షల ఆదాయానికి 10 శాతం
– 10 లక్షల నుంచి 12 లక్షల ఆదాయానికి 15 శాతం
– 15 లక్షలపైన 30 శాతం పన్ను
ధరలు తగ్గేవి
– వెండి, బంగారం ధరలు
– కొన్ని రకాల కేన్సర్ మందులు
– మొబైల్ ఫోన్లు
– ఎక్స్ రే మిషన్లు
– లెదర్ వస్తువులు
బడ్జెట్లో మరిన్ని కీలక అంశాలు
– కొత్తగా 12 పారిశ్రామిక కారిడార్లు మంజూరు
– మహిళల అభివృద్ధి కోసం 3 లక్షల కోట్లు కేటాయింపు
– ముద్ర రుణాల పరిమితి రూ. 20 లక్షలకు పెంపు
– రవాణా ఆధారిత నగరాభివృద్ధికి శ్రీకారం
– కార్మికులకు డార్మిటరీ తరహా అద్దె ఇళ్ల నిర్మాణం
– వికసిత్ భారత్ లక్ష్యంగా చర్యలు
– ప్రధానమంత్రి అన్నయోజన పథకం ఐదేళ్లు పొడిగింపు
– ఉద్యోగం, స్కిల్, ఎంఎస్ ఎంఈలపై పూర్తిస్థాయిలో దృష్టి
– వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పన
– వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు కేటాయింపు
– కొత్తగా 109 వంగడాలను ప్రవేశపెట్టడం
– నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపునకు కృషి
– కళాకారులు, హస్తకళాకారులకు ప్రాధాన్యం
– విద్యార్థుల కోసం ఏటా 10 లక్షల ఈ-ఓచర్లు
– వ్యవసాయ రంగంలో స్టార్టప్స్ కు ప్రోత్సాహం
– కూరగాయల ఉత్పత్తి కోసం భారీ స్థాయి క్లస్టర్ల అభివృద్ధి
– విద్య, నైపుణాభివృద్ధికి లక్షా 48 వేల కోట్లు
– బిహార్, జార్ఖండ్, ఏపీ రాష్ట్రాలకు ప్రత్యేక సాయం
————————–