Kadiyam Srihari
Kadiyam Srihari: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: 2014 ఎన్నికల అఫిడవిట్లలో భూములు లేవని పేర్కొన్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ఇప్పుడు వందల ఎకరాలు, ఫామ్‌హౌస్‌లు, కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. 2014కు ముందు, ప్రస్తుతం ఉన్న ఆస్తుల వివరాలను తెలంగాణ ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పట్టణ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కడియం శ్రీహరి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి వెనుకబడిందని, ప్రస్తుతం రూ.1,600 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాజయ్యపై కూడా కడియం శ్రీహరి విమర్శలు చేశారు. పదేళ్లలో చేసిన అవినీతి, అక్రమాల కారణంగానే ఆయన రాజకీయంగా దెబ్బతిన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూనే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, వైస్ చైర్పర్సన్ నీల రాజమ్మ, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
