Tirumala Srivari Brahmotsavam celebrations
* నేడు రథోత్సవం
ఆకేరు న్యూస్ , తిరుమల : తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Srivari Brahmotsavam) ముగింపు దశకు చేరుకున్నాయి. రేపటితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ శ్రీవారి రథోత్సవం, అశ్వవాహన సేవ వైభవంగా నిర్వహించనున్నారు.
ఇవాళ ఉదయం 7 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ జరగనుంది. ఈ సేవలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు.
రేపు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
