Hyderabad Ganesh Immersion Python Snake Dance
* కొండచిలువతో యువతి డ్యాన్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమంలో కొండచిలువతో డ్యాన్స్ చేసిన ఘటన కలకలం రేపింది. వైజాగ్‌కు చెందిన ఓ గ్రూప్ నిమజ్జన ఊరేగింపులో భాగంగా ప్రత్యేక ప్రదర్శన పేరుతో కొండచిలువను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. గ్రూప్‌లోని ఓ యువతి కొండచిలువను పట్టుకుని డ్యాన్స్ చేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (GHSPCA) సిబ్బంది, మధురానగర్ పోలీసులు రంగంలోకి దిగారు. సదరు గ్రూప్ కదలికలను దాదాపు ఐదు రోజుల పాటు ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది.
చివరకు వైజాగ్ గ్రూప్ నుంచి ఓ కొండచిలువతో పాటు కోడిని అధికారులు రక్షించారు. కొండచిలువను పరిశీలించగా దాని నోటిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో దానికి అవసరమైన వైద్య సంరక్షణ అందించేందుకు పశువైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో జంతువులను ప్రదర్శనలకు ఉపయోగించడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొండచిలువను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ప్రదర్శన కోసం ఎవరు అందించారు? అనే అంశాలపై పోలీసులు, జంతు సంరక్షణ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
