Prabhas fauzi Movie postponed rumours
* వీఎఫ్ఎక్స్ పనులతో విడుదల ఆలస్యం
* 2027 జనవరిలో వచ్చే అవకాశం
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫౌజీ విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తొలుత డిసెంబర్ 3న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే ఆ తేదీకి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదని నిర్మాత రవి శంకర్ తెలిపారు.
* మరో స్థాయిలో ఉంటుంది
హైదరాబాద్‌లో జరిగిన ది ప్యారడైజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఫౌజీ విడుదలపై రవి శంకర్ మాట్లాడారు. కొత్త విడుదల తేదీని ప్రకటించకపోయినా.. సినిమాను కొద్దిగా వెనక్కి జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. ఫౌజీ (Fauzi) మరో స్థాయిలో ఉంటుందని, ప్రేక్షకుల జ్ఞాపకాల్లో చిరకాలం నిలిచిపోయే చిత్రంగా రూపొందుతోందని చెప్పారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌ను ఇంతటి స్థాయిలో చూడలేదని ఆయన పేర్కొన్నారు.
* 2027లో విడుదల?
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఫౌజీకి విస్తృతమైన సీజీఐ, వీఎఫ్ఎక్స్ పనులు ఉన్నట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం అవసరం కావడంతో విడుదల వాయిదా వేస్తున్నట్లు సమాచారం. 2027 జనవరి చివరి వారంలో సినిమాను విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
