యశస్విని రెడ్డి
Yashaswini Reddy| ఆకేరు న్యూస్, రాయపర్తి: మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి, అండగా ఉంటామని భరోసా కల్పించారు.

కుటుంబాలకు పరామర్శ..
రాయపర్తి మండలం కేశవపురం గ్రామ ఉపసర్పంచ్ తండ్రి చెదల భిక్షపతి ఇటీవల మృతి చెందగా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.
జింకురాం తండా గ్రామ సర్పంచ్ సునీత శ్రీనునాయక్ వదిన కవిత మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు.
అదేవిధంగా తిరుమాలయపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముద్రబోయిన ముత్తయ్య హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆర్థిక సాయం అందజేత
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వయంగా ఆర్థిక సహాయం అందజేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

