Garividi Lakshmi
* అక్టోబర్ 17న థియేటర్లలోకి ఆనంది సినిమా
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్: ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న గరివిడి లక్ష్మి (Garividi Lakshmi) సినిమా విడుదల తేదీ ఖరారైంది. లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గరివిడి లక్ష్మి పాత్రలో నటి ఆనంది నటిస్తున్నారు. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఒక పాటతో వేలాది మంది హృదయాల్లో నిలిచిపోయిన గరివిడి లక్ష్మి జీవితం, ఆమె ప్రయాణం, జానపద కళతో ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నారు.
తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అక్టోబర్ 17న మీ అభిమాన థియేటర్లలో మా గరివిడి లక్ష్మి ఆడి పాడి అలరించబోతోంది అంటూ ప్రకటించారు.
ఈ సినిమాలో నరేష్, రాశి, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మన ఊరి పాటలు, అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే చిత్రంగా గరివిడి లక్ష్మి తెరకెక్కుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
