Dengue Vaccine
* 2027లో ప్రైవేట్ మార్కెట్లో క్యూడెంగా
* 4 నుంచి 60 ఏళ్ల వారికి రెండు డోసులు
Dengue Vaccine| ఆకేరు న్యూస్, డెస్క్: డెంగీ నివారణకు భారత్‌లో తొలి ఆమోదిత టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన టకేడా ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన ‘క్యూడెంగా’ (Qdenga/TAK-003) టీకా 2027 తొలి అర్ధభాగంలో భారత ప్రైవేట్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
CDSCO అనుమతి
దేశంలో టీకా పంపిణీకి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుంచి అనుమతులు లభించినట్లు సమాచారం. ప్రైవేట్ మార్కెట్లో క్యూడెంగా పంపిణీ, ప్రచారం కోసం టకేడా సంస్థ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
రెండు డోసులు
4 నుంచి 60 ఏళ్ల వయసున్న వారికి ఈ టీకాను ఇవ్వడానికి అనుమతి ఉంది. గతంలో డెంగీ సోకిందా లేదా తెలుసుకునేందుకు ముందస్తు పరీక్ష అవసరం లేదని పేర్కొంటున్నారు. ఇది లైవ్-అటెన్యుయేటెడ్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్. మూడు నెలల వ్యవధిలో 0.5 మి.లీ చొప్పున రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది.
నాలుగు రకాల వైరస్‌లపై రక్షణ
డెంగీ వైరస్‌కు చెందిన DENV-1, DENV-2, DENV-3, DENV-4 అనే నాలుగు సెరోటైప్లను లక్ష్యంగా చేసుకుని ఈ టీకా పనిచేస్తుంది. క్లినికల్ అధ్యయనాల్లో డెంగీ ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గించినట్లు నివేదికలు వెల్లడించాయి.
బయోలాజికల్-ఈతో ఒప్పందం
భవిష్యత్తులో భారీ స్థాయిలో టీకా ఉత్పత్తి చేసేందుకు టకేడా హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల పెద్ద సంఖ్యలో డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యం పెరగనుంది.
భారత్‌లో డెంగీ కేసులు గత రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ టీకా అందుబాటులోకి రావడం ప్రజారోగ్య పరంగా కీలక పరిణామంగా భావిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
