UPI Charges
* రూ.2,000 వరకు చార్జీలు లేవు
UPI Charges| ఆకేరు న్యూస్, డెస్క్: యూపీఐ చెల్లింపులకు సంబంధించి వస్తున్న వదంతులు, అపోహలను నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలు, వ్యాపారులకు సూచించింది. యూపీఐ పేమెంట్స్ భవిష్యత్తులో ఖరీదవుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.
రూ.2,000 వరకు చార్జీలు లేవు
చిన్న వ్యాపారులపై యూపీఐ లావాదేవీల కారణంగా ఎలాంటి అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రూ.2,000 వరకు చేసే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు వర్తించవని పేర్కొంది.
MDR, GSTపై స్పష్టత
మెజారిటీ డిజిటల్ చెల్లింపులకు MDR (Merchant Discount Rate) వర్తించదని కేంద్రం తెలిపింది. నెలకు రూ.లక్ష వరకు యూపీఐ రసీదులు స్వీకరించే చిన్న వ్యాపారులకు MDR నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నేరుగా GST భారం ఉండదని కూడా స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని, వ్యాపారులు, వినియోగదారులు ఎలాంటి ఆందోళన లేకుండా యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చని కేంద్రం భరోసా ఇచ్చింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
