Rahul Gandhi
* రాహుల్ గాంధీ సంచలన ట్వీట్
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు బట్టబయలయ్యాయని, త్వరలోనే న్యాయం జరుగుతుందని పేర్కొంటూ ఆయన ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ప్రకటనతో పాటు ఓట్చోరీ #VoteChori అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఆయన జోడించారు. ఓటరు జాబితాలు, వివిధ బూత్‌లకు సంబంధించిన పత్రాలను చేతిలో పట్టుకుని ఉన్న తన ఫోటోను పోస్ట్ చేయడం ద్వారా, ఎన్నికల ప్రక్రియ అలాగే ప్రజల ఓటు హక్కుల పరిరక్షణపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
సాయంత్రం జరిగే మీడియా సమావేశంలో ఈ అంశానికి సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
