Warangal Transco
* చీఫ్ ఇంజనీర్‌పై దౌర్జన్యం ఘటనలో వేటు
ఆకేరు న్యూస్, వరంగల్ : టీజీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ట్రాన్స్‌కో) వరంగల్ జోన్ కార్యాలయంలో జరిగిన వివాదం తీవ్రరూపం దాల్చింది. వరంగల్ జోన్ కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్‌పై దౌర్జన్యం, దాడికి పాల్పడటంతో పాటు బెదిరింపులకు దిగిన కన్స్ట్రక్షన్ డీఈ ఎల్. సంపతిరావుపై యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ మేరకు టీజీ ట్రాన్స్‌కో ఫైనాన్స్, కమర్షియల్, హెచ్ఆర్డీ డైరెక్టర్ ఓరుగంటి శ్రీనివాస్ బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
* ఏం జరిగిందంటే..
వరంగల్ ట్రాన్స్‌కో కార్యాలయంలో ఈ నెల 18వ తేదీన ఇన్చార్జ్ బాధ్యతల వ్యవహారానికి సంబంధించి డీఈ ఎల్. సంపతిరావు బయటి వ్యక్తులను వెంటేసుకొచ్చి కార్యాలయంలో దౌర్జన్యం చేశారు. అధికారులపై దాడికి యత్నించి, బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది.
ఈ ఘటనపై స్పందించిన ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపి యాజమాందానికి నివేదిక సమర్పించారు.
విజిలెన్స్ నివేదిక ఆధారంగా తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన యాజమాన్యం, సంపతిరావును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ కాలంలో సంబంధిత అధికారి అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్ విడిచి వెళ్లొద్దని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
విద్యుత్ శాఖ కార్యాలయంలోనే అధికారులపై దౌర్జన్యాలు జరగడం ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
