అశోక్ సెల్వన్
* కర్ణగా ఇంటెన్స్ లుక్‌లో అదరగొట్టిన నటుడు
King 100| ‘ ఆకేరు న్యూస్, సినిమా: కింగ్ నాగార్జున అక్కినేని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కింగ్ 100’ నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు అశోక్ సెల్వన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా కర్ణ పాత్రను పరిచయం చేస్తూ ఈ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.
కర్ణగా అశోక్ సెల్వన్
విడుదలైన పోస్టర్లో అశోక్ సెల్వన్ సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. పొడవాటి జుట్టు, గడ్డం, మెరూన్ షర్ట్‌తో ఆయన లుక్ ఎంతో ఇంటెన్స్‌గా ఉంది. చేతిలో సిగరెట్, పక్కనే ఖాకీ పోలీస్ యూనిఫామ్, ముందు చెస్ బోర్డు ఉండటం పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా చెస్ బోర్డుపై కింగ్ మూవ్‌ను చూపించడం కర్ణ పాత్ర చుట్టూ మిస్టరీని పెంచుతోంది. సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.
భారీ తారాగణం
నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో టబు, అశోక్ సెల్వన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్, సతీష్ కుమార్ ఎన్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చేపట్టారు.
క్రిస్మస్ కానుకగా విడుదల
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘కింగ్ 100’ చిత్రాన్ని 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వరుసగా పాత్రల ఫస్ట్ లుక్స్‌ను విడుదల చేస్తూ సినిమా ప్రమోషన్లను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. నాగార్జున 100వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

