Seethakka
* పర్యాటక రంగానికి కొత్త ఊపు
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప దేవాలయం వద్ద శుక్రవారం హెరిటేజ్ వాక్ నిర్వహించారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క (Seethakka), ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ భోర్కడే సహదేవరావు, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ పాల్గొని హెరిటేజ్ వాక్‌ను ప్రారంభించారు.
డిజిటల్ టెక్నాలజీతో పర్యాటక రంగం
డిజిటల్ అజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంతో పర్యాటక రంగాన్ని పునర్నిర్మించడమే ఈ ఏడాది ప్రధాన థీమ్‌గా కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యాటక రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగించడం, చారిత్రక ప్రదేశాల ప్రాధాన్యతను ప్రజలకు మరింత చేరువ చేయడంపై కార్యక్రమంలో అవగాహన కల్పించారు.
ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
రామప్ప దేవాలయ చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నిర్వహించిన హెరిటేజ్ వాక్‌లో విద్యార్థులు, అధికారులు, పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రామప్ప వారసత్వ సంపదను పరిరక్షించడంతో పాటు పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
