Gabbet Babu
* ఎస్సీ సబ్‌ప్లాన్‌పై వినతిపత్రం అందజేత
Gabbet Babu| ఆకేరు న్యూస్, రాయపర్తి: ఎస్సీ సబ్‌ప్లాన్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గబ్బెట బాబు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎస్సీ వర్గాల అభివృద్ధి, సబ్‌ప్లాన్ నిధుల వినియోగం, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన పలు అంశాలను వేం నరేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు గబ్బెట బాబు తెలిపారు.
నిధుల వినియోగంపై ప్రత్యేక దృష్టి
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు ఆయా వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరింత ప్రయోజనకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిధుల కేటాయింపు, వాటి అమలు తీరుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వివరించినట్లు తెలిపారు.
అనంతరం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని శాలువాతో సత్కరించి వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్సీ వర్గాల సమస్యలను ప్రభుత్వ స్థాయిలో ప్రస్తావించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని గబ్బెట బాబు కోరినట్లు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
