* ఎంఎంటీఎస్‌ను పొడిగించకపోవడం వెనుక కుట్ర
* నాసిరకం బతుకమ్మ చీరలను ఇచ్చి అడబిడ్డలను అవమానించారు
* అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* కేసీఆర్ అంటే జలసీ తప్ప మీకు ఏ పాలసీ లేదు : కేటీఆర్
* విద్యార్హతలపైనా ఆసక్తికర చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) ఏడో రోజు (Seventh day) కూడా వాడివేడిగా మొదలై కొనసాగుతున్నాయి. ద్రవ్య వినిమియ బిల్లుపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy), మాజీ మంత్రి కేటీఆర్ (Former minister KTR) మధ్య సంవాదం జరిగింది. బీఆర్ ఎస్ ప్రభుత్వం (BRS Government) స్వప్రయోజనాల కోసం పాలసీలను మార్చేసిందని రేవంత్ విమర్శించారు. ఎయిర్ పోర్టు వరకు ఎంఎంటీఎస్ ను ఎందుకు పొడిగించలేదని ప్రశ్నించారు. పదేళ్లు పాలించిన నేతలు ఎం ఎంఎంటీఎస్ పొడిగించకపోవడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ముచ్చర్ల దగ్గర భూసేకరణపై కేటీఆర్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఫార్మాసిటీ పేరుతో రియల్ దందాలకు పాల్పడ్డారని అన్నారు. వారు పార్మా సిటీలు అంటున్నారు.. మేం ఫార్మా విలేజ్ లను తెస్తామన్నారు.
బినామీలకు బతుకమ్మ చీరల కాంట్రాక్టు
బినామీలకు బతుకమ్మ చీరల కాంట్రాక్టు ఇచ్చారని, సూరత్ నుంచి తెచ్చిన చీరలను మహిళలకు కట్టబెట్టారని రేవంత్ విమర్శించారు. నాసిరకం చీరలిచ్చి మహిళలను అవమానపరిచారని అన్నారు. నేత కార్మికులకు పని కల్పించామని అబద్దాలు చెప్పారని, వారికి రూ.275 కోట్ల బకాయిలు పెట్టిందెవరని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చాక బకాయిలు చెల్లించామన్నారు. బతుకమ్మ చీరలపై ఆడబిడ్డలు తిరుగుబాటు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
కేసీఆర్‌లాగా అలవి కానీ హామీలు ఇవ్వలేదు
తాము ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్(KCR) లాగా అలవికాని హామీలు ఇవ్వలేదని సీఎం(CM) చెప్పారు. సూచనల పేరుతో కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇకపై ప్రభుత్వాన్ని చీల్చిచెండతామంటే తాము బుల్లెట్ ప్రూప్ జాకెట్లు వేసుకుని మరీ సభకు వచ్చామని, ఆ పెద్దాయన ఎక్కడా అని ప్రశ్నించారు. నిఖత్ జరీన్ (Nikhat Zareen) కు ఉద్యోగం ఇస్తామని మోసం చేశారని, తాము క్రికెటర్ సిరాజ్ (Cricketer Siraj), జరీన్‌కు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఏషియన్ గేమ్స (Asian Games) కు అతిథ్యం ఇచ్చిన స్టేడియాలు ఇప్పుడు తాగుబోతుల అడ్డాలుగా మారాయని విమర్శించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి తాముకట్టుబడి ఉన్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ను వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.
ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలకు తెలుసు : కేటీఆర్
కేసీఆర్ అంటే జలసీ తప్పా కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలసీ అంటూ లేదని మాజీ మంత్రి (Former minister), సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (Sirisilla MLA KTR) అన్నారు. తాను అంతో ఇంతో చదువుకున్నానని, ఉద్యోగాలు చేశానని, సీఎం రేవంత్ గురించి తనకు తెలీదని, ఆయన గురించి బయట ఏదేదో అనుకుంటారని ఎద్దేవా చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కేటీఆర్ నాలెడ్జ్‌పై రేవంత్ విమర్శల నేపథ్యంలో ఆయన బదులిచ్చారు. సభలో రేవంత్ అని కేటీఆర్ ఏకవచనంతో పిలవడంపై రాద్దాంతం జరగగా, నాకు రేవంత్ 18 ఏళ్లుగా తెలుసునని, ఆయన తన ఫ్రెండ్ అందుకే అలా పిలిచానని, తన మాటలు మీకు ఇబ్బందిగా ఉంటే తాను వెనక్కి తీసుకుంటానని తెలిపారు. స్కిల్ వర్సిటీ (Skill Varsity) ప్రారంభోత్సవానికి ప్రతిపక్ష సభ్యులు రావాలని రేవంత్ కోరుతున్నారని, ప్రొటోకాల్(Protocol) పాటిస్తే తప్పకుండా వస్తామని చెప్పారు. ఓడిపోయిన వాళ్లను వేదికలపైనా, గెలిచిన వాళ్లను అక్కడో ఇక్కడో కూర్చోబెట్టడం సరికాదని చెప్పారు.
—————————–