Gandhi Jayanti
Gandhi Jayanti| ఆకేరు న్యూస్, పాలకుర్తి: పాలకుర్తి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పోషించిన కీలక పాత్రను, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు చారగొండ్ల ప్రసాద్, జనగామ జిల్లా వాసవి సేవాదళ్ అధ్యక్షుడు నాగమళ్ళ సోమేశ్వర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గజ్జి సంతోష్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ మాట్లాడుతూ గాంధీజీ సత్యం, అహింస, శాంతి మార్గాలను అనుసరించి స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు. ఆయన చూపిన సత్యం, అహింస, స్వచ్ఛత, సేవా మార్గాలను ప్రజలు ఆచరించాలని సూచించారు.
సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యతను పెంపొందించడంలో గాంధీజీ ఆశయాలు నేటికీ ప్రాధాన్యత కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. యువత గాంధీజీ జీవితం, సిద్ధాంతాలను తెలుసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అహింస, సత్యాగ్రహం, స్వదేశీ, స్వావలంబన వంటి ఆయన ఆలోచనలు స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చాయని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తమ్మి రాంబాబు, కోశాధికారి వనమాల శ్రీనివాస్, అదనపు కార్యదర్శి పబ్బ సంతోష్, రాష్ట్ర నాయకులు మాధంశెట్టి వెంకన్న, బోనగిరి సాగర్, జిల్లా నాయకులు చిదర జగదీశ్, తమ్మి కృష్ణమూర్తి, బజ్జురి వేణుగోపాల్, బోనగిరి కృష్ణమూర్తి, మారం శ్రీనివాస్, నంగునూరి రవీందర్, అల్లాడి వెంకటేశ్వర్లు, రాపాక రమేష్, బొగ్గారపు నాగరాజు, గట్టు బాలనరసయ్య, చారగొండ్ల రవి కుమార్, గజ్జి రాజు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
