Palakurthi
Palakurthi| ఆకేరు న్యూస్, పాలకుర్తి: పాలకుర్తి మండల కేంద్రంలో ప్రముఖ దళిత నాయకుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. శుక్రవారం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు ఎడవెల్లి సోమచందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన కృషి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. ఆయన సేవలు, ఆశయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడంతో పాటు సమాజంలో సమానత్వంపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు దండు రామచందర్, చెరిపెల్లి యాదగిరి స్వామి, జలగం నరేష్, దళిత రత్న డాక్టర్ జి.వై. సోమయ్య, దళిత నాయకులు ఎడవెల్లి సోమ్మాల్లయ్య, ఎడవెల్లి వెంకన్న, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు పసులాది ప్రశాంత్, గడ్డం వరుణ్ బాబు, ఎంఆర్పీఎస్ మండల నాయకులు చిదురాల ఎల్లన్న, అనపర్తి చిరంజీవి, మండల అధికార ప్రతినిధి పసులది అశోక్, కళామండలి గుగ్గిళ్ల ఎల్లయ్య, గాయల బాబు, ఎడవెల్లి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
