Rishab Shetty
Rishab Shetty| ఆకేరు న్యూస్, సినిమా: కాంతార చాప్టర్ 1 విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. సినిమా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఓ బీటీఎస్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
కాంతార కు ప్రీక్వెల్‌గా ఈ కథను తెరకెక్కించడం సవాల్‌తో కూడుకున్నదని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. కథ మూలాల్లోకి వెళ్లి, ఆ నేల ఆత్మను ప్రతిబింబించేలా సినిమాను రూపొందించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. కాంతార చాప్టర్ 1 విడుదలై ఏడాది పూర్తయినా ప్రేక్షకుల ప్రేమ, ఆశీస్సులు కొనసాగుతున్నాయని చెప్పారు.
అయితే ఈ పోస్ట్‌లో నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్, నిర్మాత విజయ్ కిరంగందూర్, సహ నటులు రుక్మిణి వసంత్, రాజ్ బి.శెట్టిల పేర్లు ప్రస్తావించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఐదేళ్లు.. రెండు కథలు.. ఒక కల.. మరిచిపోలేని ప్రయాణం. మీరు చూపించిన ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞుడిని అంటూ రిషబ్ శెట్టి పేర్కొన్నారు.
గతంలో రిషబ్ శెట్టి హోంబలే ఫిల్మ్స్‌తో పాటు రుక్మిణి వసంత్, రాజ్ బి.శెట్టిలను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా వార్షికోత్సవ పోస్ట్‌లోనూ వారి ప్రస్తావన లేకపోవడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్ మధ్య విభేదాలకు కారణం ఏమిటన్నది మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడికాలేదు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
