Thermal Power Plant
* 24 రోజులుగా ఉత్పత్తి బంద్
ఆకేరు న్యూస్, భద్రాద్రి: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో మూడో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రోటర్ ఎక్సైటర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో గత 24 రోజులుగా ఈ యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. దీంతో సుమారు 15.5 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.
* రోజుకు 270 మెగావాట్లు
మూడో యూనిట్ అందుబాటులో లేకపోవడంతో రోజుకు సుమారు 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రోటర్ ఎక్సైటర్కు అవసరమైన పరికరాలు అందేందుకు మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్ పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది.
* మూడు యూనిట్లు పని
ప్లాంట్లోని మిగిలిన మూడు యూనిట్లు ప్రస్తుతం సాధారణంగా పనిచేస్తున్నాయి. ఈ మూడు యూనిట్ల ద్వారా రోజుకు మొత్తం 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మూడో యూనిట్లో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించి వీలైనంత త్వరగా విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
