Escalator Stopped
Escalator Stopped| ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బేగంపేట మెట్రో స్టేషన్లో ఎస్కలేటర్ ఒక్కసారిగా ఆగిపోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు ఎస్కలేటర్‌పై ప్లాట్‌ఫామ్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
ఎస్కలేటర్ మధ్యలోనే నిలిచిపోవడంతో అందులో ఉన్న మంత్రులు, ఇతరులు కొద్దిసేపు అక్కడే ఉండాల్సి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది పరిస్థితిని పరిశీలించారు. అనంతరం వారు మెట్ల మార్గంలో ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.
కీలక ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్న సమయంలో ఎస్కలేటర్ నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎస్కలేటర్ ఆగిపోవడానికి సాంకేతిక లోపమే కారణమా? లేక ఇతర కారణాలున్నాయా? అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఘటనపై మెట్రో అధికారులు పరిశీలన చేపట్టినట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
