Prakash Raj
Prakash RaJ| ఆకేరు న్యూస్, డెస్క్: నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఎన్నికల ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనం పూర్తయిందని, ఇక “జ్ఞానేష్ విసర్జన కావాలి” అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జ్ఞానేష్ కుమార్ 2025 ఫిబ్రవరి 19న 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా SIR (Special Intensive Revision) పై ప్రకాశ్ రాజ్ ప్రశ్నలు సంధించారు. SIR అంటే ఏంటో ప్రజలకు చెప్పారా? అని ప్రశ్నిస్తూ.. ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
జ్ఞానేష్ కుమార్ CECగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. అర్హులైన ఓట్ల తొలగింపు కారణంగానే పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచిందని ఆయన ఆరోపించారు. కర్ణాటక, తెలంగాణ విషయానికి వస్తే ప్రజలు అప్రమత్తమయ్యారని పేర్కొన్నారు.
అలాగే ఓటర్ల జాబితాలో మార్పులు, ఓట్ల తొలగింపు అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఎందుకు చర్చ జరగడం లేదని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా, SIR ప్రక్రియపై ఇటీవల ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయాలు, ఓటర్ల జాబితా సవరణపై వివాదం కొనసాగుతోంది. ఈ అంశంపై ఎన్నికల సంఘం కూడా తన నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
