Owaisi Allegations
* ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం..
* నిబంధనల ప్రకారమే జైలు నిర్వహణ
Owaisi Allegations| ఆకేరు న్యూస్, హైదరాబాద్: చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఆరోపణలను తెలంగాణ జైళ్ల శాఖ ఖండించింది. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ రేంజ్ జైళ్ల ఉప సంచాలకులు డా. డి. శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు.
బెయిల్లో జైలు అధికారుల పాత్ర లేదు
న్యాయవాది హత్య కేసులో నిందితుడైన ఓ రౌడీషీటర్‌కు లంచం తీసుకుని బెయిల్ ఇప్పించడంలో, జైలు నుంచే బయట దాడులకు కుట్ర పన్నడంలో సూపరింటెండెంట్ సహకరించారన్న ఆరోపణలను జైళ్ల శాఖ తీవ్రంగా ఖండించింది. బెయిల్ మంజూరు చేయడం పూర్తిగా న్యాయస్థానం పరిధిలోని అంశమని తెలిపింది. ఇందులో జైలు అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదని స్పష్టం చేసింది.
భద్రతపై ప్రత్యేక నిఘా
జైళ్ల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యం ఇస్తున్నామని శాఖ పేర్కొంది. జైలు ప్రాంగణంలో ఖైదీల అనధికారిక సమావేశాలకు అనుమతి లేదని తెలిపింది. భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఖైదీలను అవసరమైన విధంగా వేర్వేరుగా ఉంచుతున్నట్లు వెల్లడించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
జైలు సౌకర్యాలను ఉపయోగించుకుని బయట దాడులకు కుట్రలు పన్నే అవకాశం లేదని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. జైలు నిబంధనలు ఉల్లంఘించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవేనని మరోసారి స్పష్టం చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
