Palakurthi CPM Protest
*సీఈసీని తొలగించాలని డిమాండ్
*ఐలమ్మ చౌరస్తాలో మార్మోగిన సీపీఎం నిరసన గళం!
ఆకేరు న్యూస్, పాలకుర్తి : ఎన్నికల వ్యవస్థను, రాజ్యాంగబద్ధ సంస్థలను అధికార పక్షపు రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థపూరితంగా దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) – సీపీఎం ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ చౌరస్తాలో సోమవారం ఘనంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ నిరసనను ఉద్దేశించి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య మాట్లాడుతూ – పాలకుల అడుగులకు మడుగులొత్తుతూ రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ స్వతంత్రతను, పారదర్శకతను నీరుగారుస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని విమర్శించారు.
కుట్రపూరితంగా, అక్రమంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులైన పౌరుల పేర్లను ఎలాంటి నిబంధనల పేరు చెప్పకుండా తక్షణమే తిరిగి జాబితాలో చేర్చాలి. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, దాన్ని కాలరాసే హక్కు ఏ వ్యవస్థకూ లేదని స్పష్టం చేశారు.
*సీఈసీ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలి..
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) గా ఉన్న జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలి పూర్తిగా పక్షపాతపూరితంగా, అధికార యంత్రాంగానికి అనుకూలంగా ఉందని ఆరోపించారు. ఆయనపై వస్తున్న తీవ్ర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టడానికి ఆయనను తక్షణమే బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
*రాజ్యాంగ సంస్థల స్వతంత్రత కాపాడాలి..
రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థల్లో పాలకుల “రబ్బర్ స్టాంప్” అనుకూలురను నియమించడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం నశించిపోతోంది. సమగ్రత, పారదర్శకత, అన్ని రాజకీయ పార్టీలకూ సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యతను ఎన్నికల కమిషన్ విస్మరిస్తోందని మండిపడ్డారు.
*విస్తృత ప్రజా ఉద్యమానికి పిలుపు..
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, పౌరుల ఓటు హక్కును పరిరక్షించుకోవడానికి ప్రజలను చైతన్యపరుస్తూ సీపీఎం మున్ముందు పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుందని హెచ్చరించారు.
ఈ నిరసన పోరాటంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు సోమసత్యం, మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదార్, బెల్లి సంపత్, కౌడగాని మల్లేష్, పనికిరా భాస్కర్, నాయిని శ్రీను, తాటికాయల జానీ, జక్కుల శోభన్ బాబు, వేల్పుల కొమురయ్య, కాకర్ల పద్మ, తోటరాజు, చిట్యాల సంధ్యారాణి, కోంరమ్మ, బాణాల బాలమ్మ, సోమక్క, పెద్దాపురం, భాష బోయిన కుమార్, ఏ రాజు, బరిగాల పోతన, చెలుకపల్లి సోమయ్య తదితర ముఖ్యాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
