Palkurthi School
* MPPS దర్దేపల్లికి రూ. 15వేల ప్రింటర్ బహుకరణ
ఆకేరు న్యూస్ పాలకుర్తి : “సమాజ శ్రేయస్సుకు, భావి తరాల భవిష్యత్తుకు విద్యా రంగంలో చేసే సాయమే అత్యుత్తమ పెట్టుబడి” అని నిరూపిస్తూ పాలకుర్తి మండలం టెంపుల్ కాలనీ MPPS పాఠశాల LFL ప్రధానోపాధ్యాయులు, దర్దేపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి అశోక్, తన ఉదారతను చాటుకున్నారు.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) దర్దేపల్లి అభివృద్ధికి మరియు విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుదలకు తనవంతు బాధ్యతగా సుమారు ₹15,000/- విలువగల నూతన HP ప్రింటర్‌ను పాఠశాలకు విరాళంగా అందించారు.
పాఠశాల నిర్వహణలో ప్రతినిత్యం అవసరమయ్యే కార్యాలయ పత్రాల ముద్రణ, విద్యార్థుల పరీక్షాపత్రాలు, వర్క్షీట్ల తయారీ వంటి విద్యా, పరిపాలనా అవసరాలకు ఈ ప్రింటర్ ఎంతోగానో దోహదపడుతుందని పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ — “పాఠశాలల పురోగతికి సమాజ భాగస్వామ్యం ఎంతో అవసరం. శ్రీ ఇమ్మడి అశోక్, తమ ఊరి బడిపై చూపిన ప్రేమ, అందించిన ఈ ఆర్థిక సాయం ఎందరో దాతలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. పాఠశాల అవసరాలను గుర్తించి ముందుకు వచ్చిన వారి దాతృత్వం అభినందనీయం” అని కొనియాడారు.
ఈ నెలలోనే ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతల నుండి పదవీ విరమణ (Retirement) పొందుతున్న శ్రీ ఇమ్మడి అశోక్, ని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తరఫున శాలువాతో ఘనంగా సత్కరించి, హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దర్దేపల్లి ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు బి. ఉప్పలయ్య, ఉపాధ్యాయులు దేవగిరి సూర్యప్రకాష్, పోగు వెంకటనర్సయ్య, K. వనజ రాణి (LFL HM), K. శ్రీనివాస్, రజిత, ఉమారాణి, గ్రామ ప్రముఖులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
