Keshoju Ramesh Chary
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ పట్టణ అధ్యక్షునిగా కేశోజు రమేష్ చారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మలకు ప్రభుత్వం నుంచి రావలసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించేందుకు తాను కృషి చేస్తానన్నారు.
మండల గౌరవ అధ్యక్షులు ఉమా శంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యవర్గ సభ్యులు మారేడుపాక మోహన్, మొగుదుంపురం కిషోర్, కేశోజు చంద్ర మోహన్, చెక్కపల్లి రాజు, శ్రీను, రుక్మాచారి, భీష్మ చారి, శ్రీకాంత్, ఉపేందర్, లక్ష్మీనారాయణ, రాజు, కుమార్, సతీష్, రాజు, మహేష్, గణేష్, వెంకటేష్, శంకర్, సతీష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

