MLA Yashaswini Reddy Condolence Visit
* రిటైర్డ్ ఉపాధ్యాయులు ఇంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, దేవరుప్పుల: పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎర్రం రెడ్డి ఇంద్రసేనారెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, నేడు వారి నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సమాజానికి విద్యాబుద్ధులు నేర్పి ఎంతో మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చూ, భగవంతుడు ఇంద్రసేనారెడ్డి, ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దావెరా అనిల్ కుమార్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

