Nandipaka Bhaskar
* డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు చట్టసభల్లో చోటివ్వాలి
* సీఎం, గవర్నర్కు నందిపాక భాస్కర్ విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రంలో వైద్య, సామాజిక, విద్యా రంగాల్లో పునీత సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యాధికారి, విద్యావేత్త, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా (ఎమ్మెల్సీ) అవకాశం కల్పించాలని దళిత రత్న హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్ నందిపాక భాస్కర్ విజ్ఞప్తి చేశారు.
సోమవారం హనుమకొండ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గత ఇరవై ఏళ్లుగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నిరంతరం ఉచిత వైద్య సేవలందిస్తూ, వెనుకబడిన నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. సామాజిక సమత, రాజ్యాంగ పరిరక్షణే శ్వాసగా ఆయన క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్నారని తెలిపారు.
రాజ్యాంగ స్పూర్తి ప్రకారం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను విద్య, వైద్యం, సాహిత్యం, సమాజసేవ వంటి రంగాలలో అసమాన ప్రతిభ చూపిన ప్రముఖులకు కేటాయించాల్సి ఉంటుందని, సదరు విశిష్ట అర్హతలన్నీ డాక్టర్ రామకృష్ణకు పుష్కలంగా ఉన్నాయని దళిత రత్న నందిపాక భాస్కర్ స్పష్టం చేశారు. బహుజన వర్గాలకు అండగా నిలిచే ఇటువంటి నిస్వార్థ ప్రజాసేవకుడికి చట్టసభల్లో స్థానం కల్పించడం సముచితమని అభిప్రాయపడ్డారు.
ఈ విషయమై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, గవర్నర్ తక్షణమే సానుకూలంగా స్పందించి డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నియమించి తగిన గౌరవం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

