Farmers Protest
*విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా
* సమస్య పరిష్కరించాలని రైతుల డిమాండ్
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. మర్రిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో వ్యవసాయం చేస్తున్న రైతులు లో వోల్టేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని ఈ సందర్భంగా విద్యుత్ అధికారులను డిమాండ్ చేశారు.
లో వోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, వోల్టేజీ సమస్యల వల్ల వ్యవసాయ పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ సక్రమంగా అందకపోతే రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించాలని, లో వోల్టేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లపై (డీపీలు) ఉన్న ఓవర్‌లోడ్‌ను తగ్గించి, అవి తరచూ కాలిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యకు తాత్కాలిక పరిష్కారాలతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్‌స్టేషన్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రైతుల ఇబ్బందులను గుర్తించి విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించాలని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

