* విద్యుత్ లైన్ల మార్పునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Seethakka| ఆకేరు న్యూస్, ములుగు: ములుగు నియోజకవర్గంలో నివాస ప్రాంతాల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్లను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు విద్యుత్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ లైన్ల వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడంతో పాటు, ప్రమాదాల ముప్పును తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
మంత్రి సీతక్క విజ్ఞప్తికి స్పందన
ములుగు నియోజకవర్గ ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నివాస ప్రాంతాల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్లను మార్చాల్సిన అవసరాన్ని మంత్రి సీతక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని కోరుతూ నివేదిక సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క.. విద్యుత్ లైన్ల మార్పునకు రూ.3 కోట్ల నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు.
ప్రజలకు తప్పనున్న ఇబ్బందులు
విద్యుత్ లైన్ల మార్పు పనులు పూర్తయితే నివాస ప్రాంతాల్లో ప్రమాదాల ముప్పు తగ్గడంతో పాటు, ప్రజలకు మరింత భద్రత కలగనుంది. విద్యుత్ లైన్ల కారణంగా ఎదురవుతున్న సమస్యలు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ నిధుల కేటాయింపుతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది.
మంత్రి సీతక్కకు ప్రజల కృతజ్ఞతలు
నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేసిన మంత్రి సీతక్కకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ లైన్ల మార్పు పనులు త్వరితగతిన చేపట్టి, ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

