SI M. Bharath
* రఘునాథపల్లి ఎస్ఐగా ఎం.భరత్ బాధ్యతల స్వీకరణ
Raghunathpally| ఆకేరు న్యూస్, రఘునాథపల్లి: మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రఘునాథపల్లి ఎస్ఐ ఎం.భరత్ హెచ్చరించారు. సోమవారం ఆయన రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ భరత్ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి తెలియజేయాలని సూచించారు.
మండలంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా కృషి చేస్తామని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

