ఆకేరు న్యూస్, సినిమా: హీరో ఆది సాయికుమార్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో దైవిక రహస్యాలు, సస్పెన్స్‌తో కూడిన భారీ చిత్రంలో ఆయన నటించనున్నారు. ప్రొడక్షన్ నంబర్ 3గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
నవరసన్ దర్శకత్వంలో..
ఈ చిత్రాన్ని ప్రశాంత్ జి. రుద్రప్ప నిర్మిస్తున్నారు. నవరసన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రముఖ సంగీత దర్శకుడు బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆధ్యాత్మికత, విశ్వాసాలు, ప్రాచీన నమ్మకాలు, అంతుచిక్కని రహస్యాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది.
త్రిశూలం చుట్టూ నాగుపాము..
ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ డార్క్ థీమ్‌తో మిస్టరీని ప్రతిబింబిస్తోంది. పోస్టర్ మధ్యలో త్రిశూలం చుట్టూ చుట్టుకుని పడగ విప్పిన భారీ నాగుపాము ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దాని చుట్టూ కత్తులు, గొడ్డళ్లు, ఈటెలు, గద వంటి ప్రాచీన ఆయుధాలను ఏర్పాటు చేశారు. ఈ విజువల్స్ సినిమా కథలో దాగి ఉన్న అతీంద్రియ రహస్యాలు, ఉత్కంఠభరితమైన సంఘటనలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో..
బలమైన కథనం, భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా చిత్ర బృందం ఈ సినిమాను రూపొందిస్తోంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
దైవిక రహస్యాలు, పురాతన నమ్మకాలు, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కనున్న ఈ సినిమా ఆది సాయికుమార్ కెరీర్లో మరో వైవిధ్యమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందేమో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

