Naa Wife Missing| ఆకేరు న్యూస్, సినిమా: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా మరో ఆసక్తికరమైన ఒరిజినల్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుణ్ సందేశ్ శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన నా వైఫ్ మిస్సింగ్ సిరీస్ ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్న ఈ సిరీస్ నుంచి ‘అరెరే వినవా..’ పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు.
ఆకట్టుకుంటున్న పాట
లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై శివ కంఠంనేని ఈ సిరీస్‌ను నిర్మించారు. స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా స్వాతి పరిచయమవుతున్న ఈ సిరీస్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన అరెరే వినవా.. పాట సంగీత ప్రియులను ఆకట్టుకునేలా సాగింది.
ఈ సందర్భంగా కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. నా వైఫ్ మిస్సింగ్ అనే టైటిల్‌తోనే సిరీస్ చూడాలనే ఆసక్తి కలుగుతోందన్నారు. ‘అరెరే వినవా’ పాట చాలా బాగుందని, సాయి కార్తీక్ చక్కగా స్వరపరిచారని ప్రశంసించారు. దర్శకురాలిగా పరిచయమవుతున్న స్వాతికి, నిర్మాత శివ కంఠంనేని, ఆయన స్నేహితులకు ఈ సిరీస్ పెద్ద విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ఆహా మరింతగా ప్రోత్సహించాలని సూచించారు.
సాయి కార్తీక్ సంగీతం
అరెరే వినవా పాటకు సాయి కార్తీక్ అందమైన బాణీలను సమకూర్చగా, అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. శ్రీ సాయి కిరణ్ ఆకట్టుకునే సాహిత్యాన్ని అందించారు. ఈ నెల 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

